: విమానం తక్కువ ఎత్తులో వెళ్లింది: ప్రత్యక్ష సాక్షి
జర్మన్ వింగ్స్ కు చెందిన విమానం అతితక్కువ ఎత్తులో వెళ్లిందని ఓ ప్రత్యక్ష సాక్షి తెలిపారు. ఫ్రాన్స్ లోని ఆల్ఫ్స్ పర్వత ప్రాంతంలో కూలిపోయిన విమానం 33000 అడుగులపైన ప్రయాణిస్తూ, ఒక్కసారిగా 6,800 అడుగుల దిగువకు వచ్చినట్టు విమానవర్గాలు తెలిపాయి. ఆ సమయంలో ఒక్కసారిగా రాడార్ తో విమాన సంబంధాలు తెగిపోయాయని వారు వెల్లడించారు. కాగా, విమానం కూలిపోయిన ప్రదేశం సాధారణంగా మంచుతో కప్పబడి ఉంటుందని, అయితే ఇప్పుడు పొడిగా ఉంటుందని స్థానికులు పేర్కొంటున్నారు. కాగా, తమ సంస్థకు చెందిన ఎయిర్ బస్ విమానం ఫ్రాన్స్ లోని దక్షిణ ప్రాంతంలో కూలిపోవడంపై జర్మన్ వింగ్స్ విచారం వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు తీవ్ర సంతాపం ప్రకటించింది. విమానయాన సంస్థ లోగోను కూడా బూడిద రంగులోకి మార్చి సంతాపం ప్రకటించింది.