: ఫాతిమాకు రూ. 35 లక్షల చెక్కు ఇచ్చిన కేసీఆర్

కమర్షియల్ పైలట్ గా శిక్షణ పొందటానికి తనకు ఆర్థికసాయం చేయాలంటూ వెళ్లిన విద్యార్థినికి టీఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ తక్షణసాయం చేశారు. వివరాల్లోకి వెళ్తే, హైదరాబాదు పాతబస్తీకి చెందిన సయ్యద్ సల్వా ఫాతిమా కమర్షియల్ పైలట్ కావాలనుకుంది. దీనికోసం రూ. 35.5 లక్షలు ఖర్చవుతాయి. దీంతో ఆమె ఈరోజు సీఎం అధికారిక నివాసానికి వెళ్లి కలిసి, సాయం చేయాలని విన్నవించింది. ఫాతిమా కోరికను మన్నించిన కేసీఆర్... వెంటనే చెక్కును అందజేశారు. అనంతరం, తనకు ఎంతో సాయం చేసిన ముఖ్యమంత్రికి రుణపడి ఉంటానని ఫాతిమా తెలిపింది.