: నేలపాలైన రెండు క్యాచ్ లు, రెండు రనౌట్ తప్పిదాలే సౌతాఫ్రికా కొంప ముంచాయి


ఎన్నో అంచనాల నడుమ, ఎంతో ఆత్మవిశ్వాసంతో సెమీఫైనల్ లో అడుగుపెట్టిన దక్షిణాఫ్రికా నాలుగోసారి ఈ దశలో వెనుదిరిగింది. ఒత్తిడిని అధిగమించలేక చేతులు ఎత్తేస్తారనే అపప్రథను మూటగట్టుకున్న సఫారీ జట్టు మరోసారి అదే ఒత్తిడికి చేతులెత్తేసింది. 298 పరుగుల విజయలక్ష్యాన్ని కాపాడుకునేందుకు ఆదినుంచి శ్రమించిన ప్రోటీస్ జట్టు చివర్లో తడబడింది. బ్యాట్స్ మన్ విధించిన లక్ష్యాన్ని బౌలర్లు అద్భుతంగా సంరక్షిస్తున్నా, ఫీల్డింగ్ లో మెరుపులు మెరిపించిన సఫారీలు రెండు క్యాచ్ లు జారవిడిచారు. మ్యాచ్ ను ఎలాగైనా నెగ్గాలని పట్టుదలతో వున్న కెప్టెన్ డివిలియర్స్ ఓ క్యాచ్ జారవిడువగా, మరో సులభమైన రన్ అవుట్ అవకాశాన్ని చేజార్చాడు. క్యాచ్ జారవిడవడంతో ప్రాణదానం పొందిన కోరే ఆండర్సన్, రన్ అవుట్ నుంచి ప్రాణదానం పొందిన ఇలియట్ మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించారు. దీంతో మరోసారి ఒత్తిడికి సఫారీలు చేతులెత్తేస్తారనే అపప్రథను సౌతాఫ్రికా జట్టు నిజం చేసినట్టైంది.

  • Loading...

More Telugu News