: సోనియాగాంధీని ప్రజలు మర్చిపోయారు: కవిత


తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీని ప్రజలు మర్చిపోయారని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. నిజామాబాద్ జిల్లా రేంజల్ మండలం భూపల్లిలో మిషన్ కాకతీయ పనులు ప్రారంభించిన సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కాంగ్రెస్ లో పెద్ద నేతలుగా పేరున్న డీఎస్, షబ్బీర్ అలీ, సురేష్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి వంటి వారు జిల్లాకు ఒరగబెట్టిందేమీ లేదని అన్నారు. ఆంధ్రపాలకుల వల్లే తెలంగాణ అభివృద్ధి చెందలేదని ఆమె స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.

  • Loading...

More Telugu News