: భారత్ లో కేవలం 20 శాతం మందే ఇంటర్నెట్ వినియోగిస్తున్నారట
భారత్‌లో కేవలం 20 శాతం మందే ఇంటర్నెట్ వినియోగిస్తున్నారని ‘ప్యూ రీసెర్చ్ సెంటర్’ తెలిపింది. 32 వర్ధమాన దేశాల్లో సర్వే నిర్వహించిన 'ప్యూ రీసెర్చ్ సెంటర్' భారత్ లో ఇంటర్నెట్ వినియోగం సామాజిక సైట్ల వినియోగం వరకే పరిమితమవుతోందని పేర్కొంది. ఇంటర్నెట్ వినియోగిస్తున్న 20 శాతం భారతీయుల్లో 65 శాతం మంది సామాజిక వెబ్ సైట్ల కోసం ఉపయోగిస్తున్నారని స్పష్టం చేసింది. ఇందులో 55 శాతం మంది ఉద్యోగాన్వేషణ కోసం ఇంటర్నెట్ వినియోగిస్తున్నారని అధ్యయనంలో తేలింది. దేశ జనాభాలో కేవలం 14 శాతం మంది మాత్రమే స్మార్ట్ ఫోన్లు కలిగి ఉన్నట్టు అధ్యయనం వెల్లడించింది. ఇండోనేసియాలో 24 శాతం మంది ఇంటర్నెట్ వినియోగిస్తుండగా, బంగ్లాదేశ్ లో 11 శాతం మంది, పాకిస్థాన్ లో కేవలం 8 మంది ప్రజలు మాత్రమే ఇంటర్నెట్ వినియోగిస్తున్నట్టు 'ప్యూ రీసెర్చ్ సెంటర్' వెల్లడించింది.