: అసెంబ్లీ నుంచి మళ్లీ వాకౌట్ చేసిన వైకాపా
విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ అసెంబ్లీ నుంచి వైకాపా వాకౌట్ చేసింది. విద్యుత్ ఛార్జీల పెంపును తాము వ్యతిరేకిస్తున్నామని... పెంపుకు ఏ మాత్రం హేతుబద్ధత లేదని ఈ సందర్భంగా వైకాపా అధినేత జగన్ వ్యాఖ్యానించారు. అంతకు ముందు చంద్రబాబు మాట్లాడుతూ, విద్యుత్ ఛార్జీల పెంపుపై సభలో ప్రకటన చేశారు. రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెంపు వల్ల కేవలం 14 శాతం మందిపైనే భారం పడుతుందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి తెలిపారు. 200 యూనిట్ల వరకు ఛార్జీల భారం ఉండదని, వ్యవసాయానికి ఉచిత కరెంట్ ను కొనసాగిస్తామని ప్రకటించారు. అయితే, ఛార్జీల పెంపును తీవ్రంగా వ్యతిరేకించిన వైకాపా సభ నుంచి వాకౌట్ చేసింది. అంతకు ముందు కూడా స్పీకర్ వ్యవహారశైలిని తప్పుబడుతూ, వైకాపా వాకౌట్ చేసిన సంగతి తెలిసిందే.