: సాయిబాబా ఓ ముస్లిం... గొడ్డుమాంసం తినేవాడు: వివాదాన్ని తిరగదోడిన ద్వారకా పీఠాధిపతి


ద్వారకా పీఠాధిపతి శంకరాచార్య స్వామి స్వరూపానంద సరస్వతి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇంతకుముందు ఈయన, సాయిబాబా భగవంతుడు కాదని, పూజించరాదని వ్యాఖ్యానించడం తెలిసిందే. తాజాగా, సాయిబాబా ఓ ముస్లిం అని, గొడ్డు మాంసం తినేవాడని వ్యాఖ్యానించారు. తన వద్దకు స్వస్థత కోసం వచ్చే బాధితుల కోసం సాయి ఫతీహా చదివేవారని తెలిపారు. 'సబ్ కా మాలిక్ ఏక్' అన్న నినాదం గురునానక్ దని, సాయిబాబా చెప్పింది కాదని అన్నారు. హిందూ ఆలయాల్లో సాయి ప్రతిమలు పెట్టడాన్ని ప్రభుత్వం వ్యతిరేకించాలని ద్వారకా పీఠాధిపతి కోరారు. ఆయన సాయి ట్రస్ట్ పైనా విమర్శలు గుప్పించారు. ట్రస్టు ప్రజలను మోసం చేస్తోందని మండిపడ్డారు. ప్రజల నుంచి వసూలైన వందల కోట్ల సొమ్మును వివిధ బ్యాంకుల్లో దాచారని ఆరోపించారు.

  • Loading...

More Telugu News