: స్పీకర్ ఛైర్ ను కించపరిచిన ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నాం: మంత్రి యనమల
ఏపీ అసెంబ్లీ స్పీకర్ ఛైర్ ను కించపరిచిన ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నామని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. మంత్రులెవరూ సభా హక్కులను ఉల్లంఘించ లేదన్నారు. సభలో సభ్యులు ఒకరినొకరు తిట్టుకోవడం వేరు... స్పీకర్ ను కించపరచడం వేరన్నారు. స్పీకర్ ను కించపరిచిన రికార్డ్స్ ఉన్నాయని, వాటిని పరిశీలించి చర్యలు తీసుకుంటామని యనమల తెలిపారు. ఈ నెల 26న బీఏసీ సమావేశం నిర్వహించనున్నట్లు చెప్పారు. వైసీపీ సభ్యులు ఇచ్చిన అవిశ్వాస నోటీసుపై బీఏసీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.