: దేశంలో అత్యంత వయోవృద్ధురాలు మృతి
దేశంలో అత్యంత వయోవృద్ధురాలు కుంజన్నం (112 ఏళ్లు) మరణించింది. కేరళలోని త్రిశూర్ జిల్లా చూందల్ కు దగ్గరలోని పరన్నూర్ కు చెందిన ఆమె ఈ ఉదయం చనిపోయింది. భారతదేశంలో సుదీర్ఘ కాలం నుంచి నివసిస్తున్న మహిళగా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో కుంజన్నం పేరు తాజాగా చేర్చారు. కాగా, కొన్నిరోజుల నుంచీ ఆమె ఆరోగ్యం సరిగా లేదని, ఏమీ తినడం లేదని తెలిసింది. దాంతో, నిన్ననే కుటుంబసభ్యులు ఆమెను ఆసుపత్రిలో చేర్పించగా ఎలాంటి ఫలితం లేకపోయింది. ఇదిలా ఉంటే, మే 20న ఆమె 113వ పుట్టినరోజును ఘనంగా నిర్వహించాలని కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులు నిర్ణయించారు.