: సౌతాఫ్రికా స్కోర్ 281... న్యూజిలాండ్ టార్గెట్ 298 (43 ఓవర్లలో)
ఆక్లండ్ లో సౌతాఫ్రికా, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న ప్రపంచకప్ తొలి సెమీఫైనల్ మ్యాచ్ ఉత్కంఠభరితంగా మారింది. సౌతాఫ్రికా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు మధ్యలో వరుణుడు పలకరించడంతో ఆటకు కొంతసేపు అంతరాయం కలిగింది. దీంతో 43 ఓవర్లకు మ్యాచ్ ను కుదించారు. ఈ క్రమంలో నిర్ణీత 43 ఓవర్లలో దక్షిణాఫ్రికా 5 వికెట్ల నష్టానికి 281 పరుగులు చేసింది. కానీ, డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో న్యూజిలాండ్ టార్గెట్ ను 43 ఓవర్లలో 298గా నిర్ణయించారు. దక్షిణాఫ్రికా బ్యాట్స్ మెన్లలో... ఆమ్లా (10), డి కాక్ (14), డు ప్లెసిస్ (82), రొసో (39), డి విలియర్స్ (65 నాటౌట్), మిల్లర్ (49 పరుగులు, 18 బంతులు, 6 ఫోర్లు, 3 సిక్సర్లు), డుమిని (8 నాటౌట్) పరుగులు చేశారు. అండర్సన్ 3 వికెట్లు తీయగా, బోల్డ్ 2 వికెట్లు పడగొట్టాడు. అనంతరం 298 పరుగుల లక్ష్యంతో న్యూజిలాండ్ బ్యాటింగ్ ప్రారంభించింది.