: పులివెందులలో జగన్ కు వ్యతిరేకంగా ర్యాలీ
వైయస్ కుటుంబానికి కంచుకోట పులివెందులలో వైకాపా అధినేత జగన్ కు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు. రాయలసీమకు తాగు, సాగునీరు అందించడానికి సీఎం చంద్రబాబు ఎంతో కృషి చేస్తున్నారని... పట్టిసీమ ప్రాజెక్టును పూర్తి చేసి నీరు అందించాలని యత్నిస్తున్నారని.... అయితే, జగన్ ఈ కార్యక్రమానికి అడ్డుపడుతున్నారంటూ టీడీపీ శ్రేణులు ఈ ర్యాలీని చేపట్టాయి. శాసనమండలి ఉపాధ్యక్షుడు, టీడీపీ నేత సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా సతీష్ రెడ్డి మాట్లాడుతూ, పట్టిసీమ ప్రాజెక్టు పూర్తయితే రాయలసీమకు కృష్ణా జలాలు వస్తాయని, లేకపోతే రాయలసీమ ఎడారిగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పులివెందులకు కూడా నీరు అందించిన ఘనత చంద్రబాబుదే అన్నారు. పులివెందుల అంటేనే హత్యలు, ఫ్యాక్షన్ కు కేంద్రం అన్న అపఖ్యాతిని వైయస్ కుటుంబం తీసుకువచ్చిందని ఆయన మండిపడ్డారు.