: వంశీచంద్ రాజకీయాలు కట్టిపెట్టు: హరీశ్ రావు మండిపాటు


కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డిపై మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. అసెంబ్లీలో రాజకీయాలు కట్టిపెట్టాలని స్పష్టం చేశారు. రాజకీయ ఉపన్యాసాలు ఇవ్వదలచుకుంటే సభ వెలుపల ఆ పని చేయాలని సూచించారు. అసెంబ్లీలో చర్చిస్తున్న అంశంపై సూటిగా స్పందిస్తే బాగుంటుందని హితవు పలికారు. సభలో అనవసరమైన అంశాలను ప్రస్తావించరాదని అన్నారు. అంతకుముందు వంశీచంద్ రెడ్డి సభలో మాట్లాడుతూ... మంత్రులు తమ ఉద్యోగాలకు భద్రత కల్పించుకుంటున్నారు కానీ, నిరుద్యోగులను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఈ వ్యాఖ్యపైనే హరీశ్ రావు స్పందించారు. నిరుద్యోగులకు తప్పక ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు.

  • Loading...

More Telugu News