: తెలంగాణలో కులాల లొల్లి... తమకూ భవనాలు నిర్మించి ఇవ్వాలని అన్ని కులాల నుంచి డిమాండ్లు

టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొన్ని కులాలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు వరాల జల్లు కురిపించారు. వాటిలో ముఖ్యమైనది ఆయా కులాలకు రాజధాని హైదరాబాదులో భవనాలు నిర్మిస్తామనే విషయం. దీనికి సంబంధించి ఆయా కులాలకు స్థలాలు కేటాయించడమే కాక, దాదాపు రూ. 20 కోట్ల మేర నిధులను కూడా మంజూరు చేశారు. ఈ నేపథ్యంలో, దాదాపు అన్ని కులాల నుంచి... తమకు కూడా హైదరాబాదులో భవనాలు నిర్మించాలనే డిమాండ్లు వస్తున్నాయట. సాక్షాత్తూ తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ డిమాండ్లను పరిశీలిస్తామని ఆయన తెలిపారు. అయితే, తెలంగాణలో దాదాపు వందకు పైగా కులాలున్నట్టు తెలుస్తోంది. మరి ఇన్ని కులాల ప్రజలకు కేసీఆర్ ప్రభుత్వం భవనాలు నిర్మించి ఇస్తుందా? లేదా? అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే.