: ఐటీ చట్టంలోని సెక్షన్ 66ఏని కొట్టివేసిన సుప్రీం


ఐటీ చట్టంలోని సెక్షన్ 66ఏని సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ మేరకు జస్టిస్ జె.చలమేశ్వర్, జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్ లు ఈ తీర్పు వెలువరించారు. సెక్షన్ 66ఏ రాజ్యాంగ వ్యతిరేకమని పేర్కొన్నారు. వెబ్ సైట్లు, సోషల్ మీడియాలో అభ్యంతరకర అంశాలు ఉంచితే ఈ సెక్షన్ కింద అరెస్టు చేసి, మూడేళ్ల పాటు జైలు శిక్ష విధించే అధికారం ఉందని చెప్పారు. ఈ సెక్షన్ పై గతంలో పలు అభ్యంతరాలు వ్యక్తమయ్యాయని, పౌరుల భావ వ్యక్తీకరణ హక్కును సెక్షన్ 66ఏ నిరోధిస్తోందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ సెక్షన్ ను సవాలు చేస్తూ 2012లో తొలిసారి న్యాయ విద్యార్థిని శ్రేయా సింఘాల్ పిల్ వేసింది. శివసేన అధినేత బాల్ థాకరే చనిపోయినప్పుడు ముంబయిలో బంద్ పాటించడంపై ఓ విద్యార్ధిని ఫేస్ బుక్ లో వ్యతిరేకత వ్యక్తం చేసింది. ఆ కామెంటుకు మరొకరు లైక్ కొట్టడంతో నేరంగా పరిగణించి వారిద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు. దాంతో, ఈ సెక్షన్ ను సవరించాలని శ్రేయా తన వ్యాజ్యంలో కోర్టును కోరింది. లేదా, పౌరుల భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం కలిగించే ఇటువంటి సెక్షన్లను రద్దు చేయాలని విజ్ఞప్తి చేసింది.

  • Loading...

More Telugu News