: నవమి వేడుకలకు చంద్రబాబు దూరం... పట్టు వస్త్రాలు సమర్పించనున్న డిప్యూటీ సీఎం
కడప జిల్లా ఒంటిమిట్టలో ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనున్న శ్రీరామనవమి ఉత్సవాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు దూరంగా ఉండనున్నారు. ఆయన కుమారుడు లోకేష్ కు కొడుకు పుట్టినందున పురిటి మైల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. ఏప్రిల్ 2న జరగనున్న రాములవారి కల్యాణోత్సవానికి గవర్నర్ నరసింహన్ దంపతులు, సీఎం చంద్రబాబు హాజరువుతారు. మరోవైపు నవమి ఉత్సవాలపై రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు సమీక్షించారు.