: భారత సంతతి రచయిత్రిపై దాడి... సల్మాన్ రష్దీని పొగిడిన ఫలితం


దక్షిణాఫ్రికాలో భారత సంతతి మహిళపై దాడి జరిగింది. జైనుబ్ ప్రియా దలా అనే రచయిత్రిని కిరాతకంగా కొట్టారు. ఓ స్కూల్లో జరిగిన కార్యక్రమంలో, వివాదాస్పద రచయిత సల్మాన్ రష్దీని పొగడడమే అందుకు కారణం. ఘటన గతవారం డర్బన్ లో జరిగింది. జైనుబ్ తన 'వాట్ ఎబౌట్ మీరా' నవలను శనివారం లాంచ్ చేయాల్సి ఉంది. అయితే, ఆమె దాడిలో గాయపడడంతో ఈ కార్యక్రమం వాయిదా పడింది. ఇటుకతో జైనుబ్ ముఖంపై బలంగా కొట్టారు. హోటల్ నుంచి ఆమె కారులో బయలుదేరగా, ముగ్గురు వ్యక్తులు మరో వాహనంలో వెంబడించారు. మార్గమధ్యంలో జైనుబ్ కారును అడ్డగించిన వారు ఆమెపై దాడిచేసి, అసభ్య పదజాలంతో దూషించారు. వారిలో ఒకడు ఆమె మెడపై కత్తి పెట్టగా, మరో వ్యక్తి ఇటుకతో ఆమె ముఖంపై కొట్టాడు. దీనిపై రష్దీ స్పందించారు. ఇది భయానకమైన, అవమానకరమైన సంఘటన అని పేర్కొన్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. రష్దీ రచనలు ఇస్లాం వ్యతిరేకమని, అతనిపై ప్రపంచవ్యాప్త ఫత్వా విధించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News