: బాదుడు మొదలుపెట్టిన డివిలియర్స్... దక్షిణాఫ్రికా 204/3
కివీస్ తో సెమీస్ లో ఆరంభంలో తడబాటుకు గురైన దక్షిణాఫ్రికా జట్టు కెప్టెన్ ఏబీ డివిలియర్స్ రంగప్రవేశంతో ఊపందుకుంది. డివిలియర్స్ ధాటిగా ఆడుతుండడంతో పరుగులు ధారాళంగా లభిస్తున్నాయి. 37 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లకు 204 పరుగులు చేసింది. డివిలియర్స్ 54 పరుగులతో ఆడుతుండగా, డు ప్లెసిస్ 76 పరుగులతో క్రీజులో ఉన్నాడు. అంతకుముందు, బౌల్ట్ రెండు వికెట్లు తీయగా, ఆండర్సన్ ఓ వికెట్ పడగొట్టాడు. స్టార్ ఓపెనర్ ఆమ్లా 10 పరుగులు చేసి అవుటయ్యాడు.