: డబ్బు కట్టలేని రోగి చనిపోవాల్సిందేనా?... కార్పొరేట్ ఆసుపత్రుల తీరుపై గవర్నర్ ఘాటు వ్యాఖ్య


కార్పొరేట్ ఆసుపత్రుల ఖరీదైన వైద్యంపై ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘డబ్బు కట్టలేని రోగి చనిపోవాల్సిందేనా?’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కార్పొరేట్ ఆసుపత్రుల యాజమాన్యాలను అయోమయంలో పడేశాయి. హెపటైటిస్ సి వెబ్ సైట్ ప్రారంభోత్సవం సందర్భంగా నిన్న హైదరాబాదులో జరిగిన ఓ కార్యక్రమం సందర్భంగా కార్పొరేట్ ఆసుపత్రుల ధనదాహాన్ని ఆయన సూటిగా ప్రశ్నించారు. అన్ని ఆసుపత్రులు కలిసి కూర్చుని ఒక చికిత్సకు ఒకే రేటు నిర్ణయించవచ్చు కదా? అంటూ ఆయన కార్యక్రమానికి హాజరైన కార్పొరేట్ ఆసుపత్రుల యజమానులను ప్రశ్నించారు. గవర్నర్ నుంచి ఊహించని ప్రశ్న ఎదురుకావడంతో ఆసుపత్రుల యాజమాన్యాలు కాస్త ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొన్నాయి.

  • Loading...

More Telugu News