: రెచ్చగొట్టి చీర లాగించుకోవాలనేగా మీ ఉద్దేశం?: రోజాపై విప్ యామినీబాల ఫైర్!
ఏపీ అసెంబ్లీ ప్రాంగణంలో అనుచిత వ్యాఖ్యల జోరు కొనసాగుతోంది. మొన్నటిదాకా వైసీపీ ఎమ్మెల్యే రోజా అధికారపక్ష సభ్యులపై నోటికొచ్చినట్లు మాట్లాడితే, తాజాగా ఆమెపై టీడీపీ సభ్యులు అదే తరహాలో విరుచుకుపడుతున్నారు. రెచ్చగొట్టి చీర లాగించుకోవాలని రోజా చూస్తున్నారని ప్రభుత్వ విప్ యామినీబాల నిన్న వ్యాఖ్యానించారు. అయితే, అసెంబ్లీలో దుశ్శాసన పర్వం సాగనివ్వబోమని పేర్కొన్న ఆమె, రోజా ఎంతమేర రెచ్చగొట్టినా, తాము మాత్రం హద్దు మీరబోమని స్పష్టం చేశారు. నిన్నటి అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మీడియా పాయింట్ వద్ద యామినీబాల ఈ వ్యాఖ్యలు చేశారు.