: భీమవరం మావూళ్లమ్మని దర్శించుకుంటే రాష్ట్రపతి అవుతారట!
పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం మావూళ్లమ్మను దర్శించుకుంటే రాష్ట్రపతి అవడం ఖాయమేనట. నిన్నటి ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా భీమవరం ఎమ్మెల్యే రామాంజనేయులు చేసిన ఈ వ్యాఖ్య సభలో నవ్వులు పూయించింది. ఆలయానికి భద్రత కల్పించాలని డిమాండ్ చేసిన ఈ అధికార పార్టీ సభ్యుడు, ఆలయాన్ని సందర్శించాలని స్పీకర్ కోడెల శివప్రసాద్ ను కోరారు. దీంతో ముసిముసి నవ్వులు చిందించిన కోడెల ‘‘ఇప్పుడు ఆలయానికి వస్తే, అందుకే వచ్చాననుకుంటారు’’ అంటూ చమత్కరించారు.