: ప్రతిపక్షం మా గొంతు నొక్కేస్తోంది... మండలిలో ఏపీ మంత్రి రావెల వ్యాఖ్య!


ఎక్కడైనా అధికార పక్షం, విపక్షం గొంతు నొక్కడం చూశాం కానీ, విపక్ష సభ్యులు అధికారపక్షం గొంతు నొక్కడమేమిటో కాస్త విడ్డూరంగానే ఉంది. ఇప్పటికే అధికారపక్షం తమ గొంతు నొక్కుతోందని ఆరోపిస్తూ ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష వైసీపీ సమావేశాల నుంచి వాకౌట్ చేసింది. అంతేగాక, అధికారపక్షం వైఖరిని నిరసిస్తూ స్వయం నిషేధం విధించుకుంది. అయితే, ఏపీ శాసనమండలిలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. విపక్షం తమ గొంతు నొక్కుతోందని ఏపీ మంత్రి రావెల కిశోర్ బాబు నిన్న వ్యాఖ్యానించారు. "అధికారపక్షం గొంతు నొక్కేలా వ్యవహరిస్తున్న మీ సభ్యుల పట్ల మీరు బాధ్యత తీసుకుంటారా?" అంటూ ఆయన కాంగ్రెస్ పార్టీ శాసనమండలి నేత సి.రామచంద్రయ్యను నిలదీశారు. ఈ వ్యాఖ్యలతో నిన్నటి మండలి సమావేశాలు ఒక్కసారిగా వేడెక్కాయి.

  • Loading...

More Telugu News