: వరల్డ్ కప్ టీమిండియాదేనట... కివీస్ పై 20 రన్స్ తేడాతో గెలుపు!: ‘వాట్సాప్ మెసేజ్’ జోస్యం!
ఈసారి వరల్డ్ కప్ కూడా భారత్ దేనట! వరుసగా రెండో సారి కూడా టైటిల్ టీమిండియానే వరించనుందట. అంతేకాదండోయ్, నేటి సెమీస్ లో దక్షిణాఫ్రికాను చిత్తుచేసి కివీస్ ఫైనల్ చేరుతుందట! ఫైనల్లో కివీస్ ను టీమిండియా ఓడిస్తుందట. అది కూడా 20 పరుగుల తేడాతోనేనట. అదేంటీ, మ్యాచ్ కు ఇంకా చాలా సమయం ఉంది కదా? అంటే, జరగబోయేదేంటో ముందే చెప్పేస్తున్నామంటోంది ఓ వాట్సాప్ మెసేజ్. నిజమేనండోయ్, సదరు వాట్సాప్ మెసేజ్ ఇదివరకు చెప్పిన విషయాలన్నీ నిజమయ్యాయి. అందుకే ప్రస్తుతం ఈ ‘వాట్సాప్ మేసేజ్ జోస్యం’పై ఆసక్తికర చర్చ నడుస్తోంది. ప్రధానంగా అలహాబాదు నగరంలో ఎక్కడ చూసినా దీనిపై చర్చలే కనిపిస్తున్నాయి. ఈ మెసేజ్ నిజమైతే, అంతే చాలంటూ భారత క్రికెట్ అభిమానులు ఒకటికి రెండుసార్లు ఆ వాట్సాప్ మెసేజ్ ను చూసేస్తున్నారు.