: పెట్రోలు, డీజిల్ పై వ్యాట్ పెంపు జీవోను క్షణాల్లో ఉపసంహరించుకున్న తెలంగాణ
పెట్రోలు, డీజిల్ పై విలువ ఆధారిత పన్ను (వ్యాట్)ను పెంచుతూ జారీ చేసిన జీవోను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్షణాల్లో ఉపసంహరించుకుంది. ఈ సాయంత్రం పెట్రోల్ పై 40 శాతానికి, డీజిల్ పై 32 శాతానికి వ్యాట్ పెంచుతూ జీవో జారీ చేసింది. జీవో విడుదలైన కొద్ది సేపటికే దానిని రద్దు చేస్తూ కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సాంకేతిక సమస్యల వల్లే వ్యాట్ పెంపు నిర్ణయం లీకైందని, ఆ విషయం గుర్తించిన వెంటనే ఉపసంహరించుకున్నామని అధికారులు తెలిపారు. దీంతో తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం అమలులో ఉన్న పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పులు ఉండవని అధికారులు స్పష్టం చేశారు.