: ఎన్నాళ్లు కేంద్రానికి తొత్తులుగా పనిచేస్తారు?.... ప్రత్యేక హోదా కోసం నటుడు శివాజీ ఉద్యమం
టాలీవుడ్ నటుడు, బీజేపీ నేత శివాజీ ఏపీకి ప్రత్యేక హోదా అంశంలో పట్టువీడేది లేదని స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా డిమాండ్ తో రేపటి నుంచి ఏపీలో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఉద్యమం చేపడుతున్నామని స్పష్టం చేశారు. రాష్ట్ర నేతలు ఎన్నాళ్లు కేంద్రానికి తొత్తులుగా పనిచేస్తారు? అంటూ ఆవేదన వెలిబుచ్చారు. పరిశ్రమలు వస్తాయని రాష్ట్ర ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారని, రాష్ట్ర నేతలంతా అంతర్యుద్ధానికి నాంది పలుకుతున్నారని అన్నారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అనేదే తమ నినాదం అని, మాట తప్పవద్దు... ఆంధ్రను ముంచవద్దు అని స్పష్టం చేశారు.