: ప్రధానితో కలిసి విందు ఆరగించనున్న కేసీఆర్


తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు హస్తినలో ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చే విందు కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఏప్రిల్ 4న మోదీ ఢిల్లీలో రాష్ట్రాల ముఖ్యమంత్రులకు విందు ఇస్తున్నారు. రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులు, శాంతిభద్రతలు తదితర అంశాలను మోదీ ఈ సందర్భంగా సీఎంలతో చర్చిస్తారు. కాగా, ఈ కార్యక్రమానికి కేసీఆర్ కు కూడా ఆహ్వానం అందింది. సీఎం మూడు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్నారు. తొలుత విందు సమావేశానికి హాజరవుతారు. ఆ తర్వాతి రోజు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల సమావేశంలో పాల్గొంటారు.

  • Loading...

More Telugu News