: టోక్యో-కవసాకి-యొకహామా తరహాలో ఏపీ అభివృద్ధి: చంద్రబాబు


టోక్యో-కవసాకి-యొకహామా తరహాలో ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, వచ్చే నెల 24న ఇన్వెస్ట్ మెంట్ మిషన్ ను ప్రారంభించనున్నామని అన్నారు. టోక్యో-కవసాకి-యొకహామా తరహాలో నెల్లూరు-చెన్నై-తిరుపతి ప్రాంతాన్ని ఆటోమొబైల్ హబ్ గా తీర్చిదిద్దుతామని ఆయన చెప్పారు. ఆటోమొబైల్ అనుబంధ రంగాలకు సంబంధించి వచ్చే మంత్రివర్గ సమావేశంలో విధాన ప్రకటన విడుదల చేయనున్నామని ఆయన వెల్లడించారు.

  • Loading...

More Telugu News