: పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తాం: హరీష్ రావు


తెలంగాణలో పెండింగ్ లో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని మంత్రి హరీష్ రావు తెలిపారు. తెలంగాణ అసెంబ్లీలో ఆర్థిక పద్దులపై జరిగిన చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈపీసీ సిస్టమ్ ఇక రాష్ట్రంలో ఉండదని స్పష్టం చేశారు. ఎల్ఎస్ సిస్టమ్ లోనే టెండర్లు పిలుస్తామని ఆయన చెప్పారు. ప్రాజెక్టుల నిర్మాణంలో నిర్లక్ష్యం వహించే కాంట్రాక్టర్లపై చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. కాకతీయుల నుంచి వారసత్వంగా వచ్చిన చెరువులను కాపాడుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఒకసారి చెరువు నిండితే నాలుగేళ్లు సాగు, తాగు నీటికి ఢోకా ఉండదని ఆయన స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News