: పెట్రోలు, డీజిల్ పై వ్యాట్ పెంచిన తెలంగాణ
పెట్రోలు, డీజిల్ పై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ పెంచింది. పెట్రోల్ పై వ్యాట్ 40 శాతానికి పెంచిన తెలంగాణ ప్రభుత్వం, డీజిల్ పై 32 శాతానికి వ్యాట్ పెంచింది. తెలంగాణలో పెట్రోల్ పై వ్యాట్ 35.2 శాతం ఉండగా, దానిని 40 శాతానికి పెంచింది. అలాగే డీజిల్ పై 27 శాతం వ్యాట్ ఉండగా, దానిని 32 శాతానికి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.