: స్పిన్ వేయడం అంత కష్టమేమీ కాదు: ఫాల్క్ నర్
స్పిన్ వేయడం అంత కష్టమైన విషయమేమీ కాదని ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ జేమ్స్ ఫాల్కనర్ అభిప్రాయపడ్డాడు. మార్చి 26న జరగనున్న సెమీఫైనల్ నేపథ్యంలో ఫాల్కనర్ ఆయన మాట్లాడుతూ, భారత్ తో జరిగే సెమీఫైనల్ మ్యాచ్ లో స్పిన్ పెద్ద విషయమేమీ కాదని అన్నాడు. సిడ్నీ పిచ్ స్పిన్ పిచ్ అని భయపడాల్సిన అవసరం లేదని ఫాల్కనర్ చెప్పాడు. తమ జట్టులో స్పిన్నర్లు లేరని భావించడం సరికాదని ఆయన సూచించాడు. అలాగని టీమిండియాను తక్కువ అంచనా వేయడం లేదని స్పష్టం చేశాడు. కాగా, కెప్టెన్ క్లార్క్ మాట్లాడుతూ, టీమిండియాతో సెమీఫైనల్ మ్యాచ్ ను ఫైనల్ లా భావిస్తున్నామని అన్నాడు.