: తిరుమల అవ్వాచారికోన వద్ద మంటలు
తిరుమల గిరుల్లో మరో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మొదటి కనుమ రహదారిలోని అవ్వచారికోన వద్ద మంటలు చెలరేగాయి. దీనిపై సమాచారం అందుకున్న టీటీడీ వెంటనే రంగంలోకి దిగింది. అటు, అగ్నిమాపక సిబ్బంది కూడా సకాలంలో స్పందించి మంటలను ఆర్పేందుకు శ్రమిస్తున్నారు. వేసవి కాలంలో తిరుమల అటవీప్రాంతంలో అగ్నిప్రమాదాలు ఎక్కువగా జరుగుతుంటాయన్నది తెలిసిందే. కొన్నిసార్లు ప్రమాదవశాత్తు జరుగుతుండగా, మరికొన్నిసార్లు ఎర్రచందనం స్మగర్లే ఉద్దేశపూర్వకంగా అడవిని తగలబెడతారన్న వాదనలున్నాయి. అటవీశాఖ సిబ్బందిని తప్పుదోవ పట్టించేందుకు స్మగర్లు ఇలాంటి ఎత్తుగడలకు పాల్పడతారని అధికారుల అభిప్రాయం.