: బాలీవుడ్ నటుడు శశికపూర్ కు దాదాసాహెబ్ ఫాల్కే
బాలీవుడ్ నటుడు శశికపూర్ కు కేంద్ర ప్రభుత్వం దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం ప్రకటించింది. 2014 సంవత్సరానికిగానూ ఈ పురస్కారం ఆయనకు ప్రకటించారు. బాలీవుడ్ లో నటుడు, దర్శకుడు, నిర్మాతగా ఆయన పేరు సంపాదించుకున్నారు. పలు హిందీ చిత్రాలతో పాటు కొన్ని ఆంగ్ల చిత్రాల్లోనూ నటించారు. 40వ దశకంలో శశికపూర్ బాలనటుడిగా తెరంగేట్రం చేశారు. అక్కడి నుంచి సోలో హీరోగా పలు హిట్ చిత్రాల్లో నటించారు. ఆయన మల్టీస్టారర్లలోనూ తన నటనా ప్రతిభను చాటారు. సోదరుడు, విఖ్యాత నటుడు రాజ్ కపూర్ కు కూడా ఈ ప్రతిష్ఠాత్మక అవార్డు 1987లో వచ్చింది.