: మంత్రి పీతల సుజాతపై ఆరోపణలు రుజువు చేస్తా: రోజా
తనపై చేసిన ఆరోపణలు రుజువు చేయాలంటూ మంత్రి పీతల సుజాత విసిరిన సవాల్ కు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా స్పందించారు. శాసనసభలో తనకు తగినంత సమయం కేటాయిస్తే మంత్రి అవినీతిని ఆధారాలతో నిరూపిస్తానని చెప్పారు. సభలో టీడీపీ సభ్యులు తమను అనరాని మాటలంటుంటే ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఏమిటని రోజా ప్రశ్నించారు. వికలాంగుల హక్కుల పోరాట సమితి తనపై ఫిర్యాదు చేయడంపై స్పందించిన ఆమె, పొరపాటున కూడా తానెప్పుడూ వికలాంగులను కించపర్చలేదని వివరణ ఇచ్చారు.