: మహిళ వద్ద బందీగా యువకుడు... తన కుమారుడ్ని విడిపించాలంటూ తండ్రి ఫిర్యాదు


హర్యానాలోని ఫరీదాబాద్ లో మహేష్ అనే యువకుడిని మహిళ కిడ్నాప్ చేయడం సంచలనం సృష్టించింది. మీరా అనే మహిళ వద్ద బందీగా ఉన్న తన కుమారుడ్ని విడిపించాలంటూ మహేష్ తండ్రి పోలీసులను ఆశ్రయించాడు. మీరాతో కుటుంబ పరిచయం ఉందని, అంతకుమించి ఎలాంటి బంధుత్వం లేదని మహేష్ తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో, కేసు నమోదు చేసిన పోలీసులు, విచారణ ప్రారంభించారు. కాగా, ఆమె మహేష్ ను ఎందుకు కిడ్నాప్ చేసింది? ఎలా కిడ్నాప్ చేసింది? అనే విషయాలు వెలుగులోకి రావాల్సిఉంది.

  • Loading...

More Telugu News