: ఏపీలో విద్యుత్ ఛార్జీల పెంపు ఉత్తర్వులు విడుదల
2015-16 ఆర్థిక సంవత్సరానికి విద్యుత్ ఛార్జీల పెంపు ఉత్తర్వులను ఈఆర్ సీ ఛైర్మన్ జస్టిస్ భవానీ ప్రసాద్ విడుదల చేశారు. ఈ మేరకు ఆయన హైదరాబాదులో మీడియాతో మాట్లాడుతూ, నెలకు 200 యూనిట్లు పైగా విద్యుత్ వాడకానికి ఛార్జీల పెంపు వర్తిస్తుందని తెలిపారు. గృహ విద్యుత్ కు సంబంధించి 200 యూనిట్ల వరకు ఛార్జీల పెంపు లేదని చెప్పారు. వ్యవసాయానికి, కుటీర పరిశ్రమలకు, ఎల్ టీ కేటగిరి-3లో మరికొంతమందికి ఛార్జీల పెంపు నుంచి మినహాయింపు ఇచ్చినట్టు వివరించారు. అంతేగాక, చక్కెర మిల్లులు, పౌల్ట్రీ పరిశ్రమలకు కూడా ఛార్జీల పెంపు నుంచి మినహాయింపు ఇచ్చామన్నారు. ప్రభుత్వం రూ.3,186 కోట్ల మేర రాయితీ ఇచ్చినట్టు వెల్లడించారు.