: తడిసిన టెన్నిస్ బాల్స్ తో రైనా ప్రాక్టీస్


ప్రపంచకప్ పోటీల్లో టీమిండియా ప్రత్యర్థి జట్టును బట్టి ప్రణాళికలు రచిస్తోంది. మ్యాచ్ మ్యాచ్ కూ వ్యూహాన్ని మార్చుకుంటూ, ప్రణాళికలు పక్కాగా అమలు చేస్తూ సత్ఫలితాలు రాబట్టుకుంటోంది. పాక్ తో మ్యాచ్ సందర్భంగా పొడగరి ఇర్పాన్ బౌలింగ్ ను ఎదుర్కొనేందుకు సహాయక సిబ్బందిని బెంచ్ లెక్కించి బంతులు వేయించుకున్న బ్యాట్స్ మెన్, ఈసారి తడిసిన టెన్నిస్ బంతులతో ప్రాక్టీస్ చేస్తున్నారు. తడిసిన టెన్నిస్ బంతులు బిరుసెక్కి మరింత బౌన్స్ తో వేగాన్ని పుంజుకుంటాయి. వాటితో ప్రాక్టీస్ చేస్తే ఆస్ట్రేలియా ఆటగాళ్లను సులభంగా ఎదుర్కోవచ్చని టీమిండియా భావిస్తోంది. ఆసీస్ లో మిషెల్ స్టార్క్ గంటకు 150 కిలోమీటర్ల వేగంతో బంతులేస్తున్న సంగతి తెలిసిందే. జేమ్స్ ఫల్కనర్, డొహార్తీ, హాజిల్ వుడ్ లు బౌన్సర్లతో ప్రత్యర్ధులపై విరుచుకుపడుతున్నారు. వీరి బౌలింగ్ గురించి అవగాహన ఉన్న సురేష్ రైనా వారిని సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు తడిసిన టెన్నిస్ బంతులతో ప్రాక్టీస్ చేస్తున్నాడు. బలహీతనలను అధిగమించేందుకు రైనా కోచ్ ఫ్లెచర్ సాయం తీసుకుంటున్నాడు. మిగిలిన ఆటగాళ్లు కూడా ప్రాక్టీస్ లో మునిగిపోయారు. మూడోసారి టీమిండియాకు వరల్డ్ కప్ టైటిల్ అందించే సువర్ణావకాశం ముగిట ఉండడంతో, బీసీసీఐ ఆటగాళ్లకు కుటుంబంతో గడిపే అవకాశం ఇచ్చినా, ప్రాక్టీస్ కే మొగ్గుచూపడం ఆటగాళ్ల నిబద్ధతను చాటుతోంది.

  • Loading...

More Telugu News