: ఆ మెడికల్ కళాశాలల్ని నడపలేం... మీరే నిర్వహించుకోండి: ఈఎస్ఐసీ


తెలంగాణ, హర్యానా, తమిళనాడు రాష్ట్రాల్లో నిర్వహిస్తున్న మెడికల్ కళాశాలల్ని ఇక నడపలేమని ఈఎస్ఐసీ చేతులెత్తేసింది. మెడికల్ కళాశాలలకు అనుబంధంగా నిర్వహిస్తున్న ఆసుపత్రులలో ఇన్ పేషంట్స్ సరైన సంఖ్యలో లేని వాటిని ఆయా రాష్ట్రాలకు అప్పగించనున్నట్టు ఈఎస్ఐసీ తెలిపింది. రాష్ట్రాలు కూడా వాటిని నిర్వహించేందుకు ముందుకు రాని పక్షంలో పీపీపీ విధానంలో ఆయా ఆసుపత్రులను నిర్వహించాలని ఈఎస్ఐసీ భావిస్తోంది. కాగా, బెంగళూరు, చెన్నై, కోల్ కతా, ఢిల్లీల్లోని మెడికల్ కళాశాలలను మాత్రం ఈఎస్ఐసీ నిర్వహించనుంది.

  • Loading...

More Telugu News