: గాంధీని గాడ్సే ఎలా చంపాడో అలా చంపుతాం... అన్నాకు కెనడా నుంచి బెదిరింపు కాల్స్
సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారేకు కెనడా నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయి. గాంధీని గాడ్సే ఎలా చంపాడో అలా చంపుతామని ఓ గుర్తు తెలియని వ్యక్తి తనకు ఫోన్ చేసి బెదిరించాడని హజారే తెలిపారు. అంతకుముందు, హజారే ప్రధాని నరేంద్ర మోదీ రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని హజారే విమర్శించడం తెలిసిందే. ప్రధాని 'మన్ కీ బాత్' రేడియో ప్రసంగంపై స్పందిస్తూ... భూసేకరణ చట్ట సవరణ బిల్లుపై రైతులను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. "విదేశాల నుంచి నల్లధనం వెనక్కు తెస్తానని హామీ ఇచ్చిన మీరు, మీకు అనుకూలంగా ఓటేసిన ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు" అని హజారే మండిపడ్డారు.