: బస్సు, కారు ఢీ... మాజీ ఎమ్మెల్యే కూతురు మృతి


తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. నిత్యం రోడ్లు నెత్తురోడుతూనే ఉన్నాయి. తాజాగా మరో ఘోరం సంభవించింది. ఆర్టీసీ బస్సు, కారు ఢీకొన్న ఘటనలో గుంటూరు జిల్లా పొన్నూరు మాజీ ఎమ్మెల్యే చిట్టినేని వెంకటరావు కూతురు పద్మజ మృత్యువాత పడ్డారు. ఆమె భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ అతడిని ఆసుపత్రికి తరలించారు. ఈ దారుణ ఘటన గుంటూరు సమీపంలోని బ్రాహ్మణపల్లి అడ్డరోడ్డు వద్ద చోటు చేసుకుంది. ఇదే ప్రాంతంలో అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News