: డబ్ల్యూటీఏ పట్టికలో సానియాకు అత్యుత్తమ ర్యాంకు
ప్రతిష్ఠాత్మక ఇండియన్ వెల్స్ డబ్ల్యూటీఏ ప్రీమియర్ టోర్నమెంట్ లో డబుల్స్ టైటిల్ గెలుచుకున్న క్రీడాకారిణి సానియా మీర్జా అత్యుత్తమ ర్యాంకు దక్కించుకుంది. ఈ విజయంతో వెయ్యి పాయింట్లు సంపాదించుకున్న ఆమె డబ్ల్యూటీఏ పట్టికలో రెండు స్థానాలు మెరుగుపరుచుకుని 6885 పాయింట్లతో మూడవ స్థానంలో నిలిచింది. దానిపై సానియా స్పందిస్తూ, "కెరీర్ లో బెస్ట్ ర్యాంకు సంపాదించడం చాలా థ్రిల్లింగ్ గా ఉంది. నంబర్ వన్ కావడం నా కల. ఏదోఒక రోజు దాన్ని సాధిస్తానని ఆశిస్తున్నా" అని సంతోషం వ్యక్తం చేసింది.