: పోయిన వారిని గుర్తు చేసుకొని కన్నీరు కార్చిన సినీ ప్రముఖులు


ఫిలింనగర్ దైవ సన్నిధానంలో ఒక వైపు అమృత పాశుపత మహా మృత్యుంజయ హోమం జరుగుతుంటే, అక్కడికి వచ్చిన సినీ పెద్దలు పోయినవారిని గుర్తు చేసుకొని కంటతడి పెట్టారు. మూడు రోజుల పాటు జరగనున్న ఈ కీడు నివారణ హోమం తొలిరోజు పార్లమెంట్ సభ్యుడు మురళీమోహన్, దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు, నటీనటులు జయప్రద, కోట శ్రీనివాసరావు, విజయనిర్మల తదితరులు పాల్గొన్నారు. సినీ రంగానికి పెద్ద దిక్కుగా ఉన్న అక్కినేని నాగేశ్వరరావు, డి. రామానాయుడులతో పాటు సంగీత దర్శకుడు చక్రీ, హీరోలు ఉదయ కిరణ్, శ్రీహరి, నటులు ఆహుతి ప్రసాద్, హాస్య నటులు ఎంఎస్ నారాయణ, ఏవీఎస్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, దర్శకుడు బాపు, నిర్మాత నందమూరి జానకిరామ్ వంటి వారిని కళామతల్లి కోల్పోయిందని గుర్తుచేసుకున్నారు. కోట శ్రీనివాసరావు, విజయనిర్మల తదితరులు దుఃఖాన్ని ఆపుకోలేకపోయారు.

  • Loading...

More Telugu News