: స్పీకర్ పై మరోసారి మండిపడ్డ రోజా... నన్ను అవమానిస్తే ఎన్టీఆర్, బాలకృష్ణను కూడా అవమానించినట్టే!


రాజ్యంగబద్ధమైన పదవిలో ఉన్న స్పీకర్ పై వైకాపా ఎమ్మెల్యే రోజా మరోసారి నోరు పారేసుకున్నారు. స్పీకర్ కోడెలకు దమ్ము, ధైర్యం ఉంటే ముఖ్యమంత్రి చంద్రబాబుపై చర్య తీసుకోవాలని సవాలు విసిరారు. 67 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడుతూ, 'పిచ్చిపిచ్చిగా ఉందా? మీ అంతు చూస్తా'నంటూ వార్నింగ్ ఇచ్చారని... దీనిపై స్పీకర్ చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. తనను ఉద్దేశించి గోరంట్ల బుచ్చయ్య చౌదరి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సినీ రంగం నుంచి వచ్చిన తనను అవమానిస్తే... అదే రంగం నుంచి వచ్చిన ఎన్టీఆర్, బాలకృష్ణలను కూడా అవమానించినట్టేనని రోజా చెప్పారు. బోండా ఉమా మా ఎమ్మెల్యే నానిని ఉద్దేశించి పాతేస్తానని హెచ్చరించినా, తనను ఉద్దేశించి కాలి గోటికి కూడా సరిపోవని మంత్రి పీతల సుజాత అన్నా స్పీకర్ వారించలేదన్నారు. పాతేస్తాం, అంతు చూస్తాం, 420 లాంటి పదాలు అన్ పార్లమెంటరీ కాదని స్పీకర్ భావించడం దురదృష్టకరమని అన్నారు.

  • Loading...

More Telugu News