: పెళ్లికొడుకు కాబోతున్న షాహిద్ కపూర్... ఢిల్లీ అమ్మాయితో వివాహం!


బాలీవుడ్ హ్యాండ్ సమ్ బాయ్, హీరో షాహిద్ కపూర్ త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నాడు. ఢిల్లీ అమ్మాయి మీరా రాజ్ పుత్ ను డిసెంబర్ లో వివాహం చేసుకోబోతున్నాడు. జనవరి 14న వారిద్దరికీ నిశ్చితార్ధం జరిగిందట. ఇక షాహిద్ కు కాబోయే భార్య వివరాల్లోకి వెళితే, ప్రస్తుతం మూడవ సంవత్సరం ఇంగ్లీష్ (ఆనర్స్) చదువుతున్న మీరా, వసంత్ వ్యాలీ పాఠశాలలో విద్యాభ్యాసం పూర్తి చేసిందట. 'రాధా సొయ్మి సత్సంగ్ బియాస్' అనే ఓ మత గ్రూపు ద్వారా ఆమెతో షాహిద్ కు పరిచయం ఏర్పడిందట. అటు షాహిద్, అతని తండ్రి పంకజ్ కపూర్ లు ఈ గ్రూప్ ను నిత్యం ఫాలో అవుతుంటారు. ఇప్పటికే ఛాతర్ పర్ లో ఉన్న పెళ్లికుమార్తె ఇంటికి షాహిద్ తండ్రి వెళ్లి మాట్లాడి వచ్చినట్టు సమాచారం. తాను సినీ పరిశ్రమకు చెందని అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నట్టు ఒకానొక సమయంలో చెప్పిన షాహిద్ దానిని ఇప్పుడు ఆచరణలో పెడుతున్నాడు.

  • Loading...

More Telugu News