: బ్యాటుతోనే కాదు బాల్ తోనూ రాణిస్తా... సిడ్నీలో స్పిన్ తిప్పేస్తానంటున్న మ్యాక్స్ వెల్!


గ్లెన్ మ్యాక్స్ వెల్ తనదైన రోజున ఒంటిచేత్తో ఆసీస్ ను గెలిపిస్తాడు. చూడ్డానికి బక్క పలుచగా ఉండే ఈ ఆల్ రౌండర్ బ్యాట్ ఝుళిపిస్తే... ఎంతటి జట్టైనా, ఏ మైదానమైనా చిన్నబోవాల్సిందే. వరల్డ్ కప్ లో అతడి జట్టు నానా కష్టాలు పడి సెమీస్ కు చేరింది. సెమీస్ లో డిఫెండింగ్ ఛాంపియన్ టీమిండియాతో పోరుకు సిద్ధమవుతోంది. ఈ రెండు జట్ల మధ్య జరగనున్న వేదిక సిడ్నీ క్రికెట్ గ్రౌండ్. స్పిన్ కు అనుకూలించే మైదానం. అయితే ఆసీస్ బలమంతా బ్యాటింగ్ తో పాటు స్పీడ్ బౌలింగే. షేన్ వార్న్ నిష్క్రమణ తర్వాత ప్రధాన స్పిన్ బౌలర్ ఆ జట్టుకు దొరకలేదు. అయితే సెమీస్ లో ఆ జట్టును ఢీకొనబోతున్న టీమిండియా అమ్ములపొదిలో ఎంతటి ప్రత్యర్థినైనా బోల్తా కొట్టించే స్పిన్ అస్త్రాలు బోలెడున్నాయి. మరి టీమిండియాను కట్టడి చేసేదెలా? స్పిన్ లోటును తీర్చుకునేదెలా? అని ఆసీస్ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ అంతర్మథనంలో కూరుకుపోయారు. సరిగ్గా అప్పుడే, నేనున్నాను అంటూ గ్లెన్ మ్యాక్స్ వెల్ నోరు విప్పాడు. బ్యాటుతోనే కాదు బాల్ తోనూ రాణించగలను అంటూ జట్టు కెప్టెన్ కు సందేశాలు పంపాడు. ‘‘ఇప్పటికే వరల్డ్ కప్ లో నా స్పిన్ బౌలింగ్ తో రెండు వికెట్లు తీశాను. క్లార్క్ బంతి ఇచ్చిన ప్రతిసారీ సద్వినియోగం చేసుకున్నాను. సిడ్నీలో కూడా క్లార్క్ నుంచి అవకాశం లభిస్తే చెలరేగుతా. ప్రత్యర్థి జట్టు పరుగులను కట్టడి చేయడమే కాక, కీలక వికెట్లు కూడా తీయగలను. బౌలింగ్ కోచ్ డావిసన్ నుంచి ఇప్పటికే పలు సలహాలు, సూచనలు తీసుకుని సిద్ధమయ్యాను’’ అంటూ అతడు చెబుతున్నాడు.

  • Loading...

More Telugu News