: జిందాల్ ఢమాల్!... బొగ్గు గనుల బిడ్లను తిరస్కరించిన కేంద్రం
బొగ్గు, విద్యుత్, ఉక్కు తదితర రంగాల్లో సేవలందిస్తున్న ప్రముఖ సంస్థ జిందాల్ స్టీల్ ఈక్విటీ వాటా విలువ భారీగా పతనం అయింది. తాజాగా కేంద్రం చేపట్టిన బొగ్గు గనుల వేలంలో జిందాల్ దాఖలు చేసిన బిడ్లను తిరస్కరిస్తున్నట్టు కేంద్రం ప్రకటన చేసిన నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆందోళనకు గురయ్యారు. అమ్మకాల ఒత్తిడి అధికంగా ఉండడంతో స్టాక్ మార్కెట్ సెషన్ ప్రారంభంలోనే జిందాల్ స్టీల్ విలువ 14 శాతం పడిపోయింది. క్రితం ముగింపు 165 రూపాయలతో పోలిస్తే నేడు జిందాల్ ఈక్విటీ రూ. 140కి దిగజారింది. బీఎస్ఈలో సెకన్ల వ్యవధిలో 13.9 లక్షల వాటాలు అమ్మకానికి వచ్చాయి. ఉదయం 11:50 గంటల సమయంలో సంస్థ వాటా విలువ రూ. 150 వద్ద కొనసాగుతోంది.