: దాసరి ఆస్తుల అటాచ్ మెంట్ కు రంగం సిద్ధం... కసరత్తు చేస్తున్న ఈడీ
దర్శకరత్న దాసరి నారాయణరావుకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఝలకిచ్చేలానే ఉంది. బొగ్గు కుంభకోణంలో ముడుపులు తీసుకున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన ఆస్తులను జప్తు చేసే దిశగా ఈడీ చర్యలు ప్రారంభించిందని విశ్వసనీయ సమాచారం. ఫిక్స్ డ్ డిపాజిట్ల రూపంలోని రూ.2 కోట్లను అటాచ్ చేసే అవకాశాలున్నాయనే వదంతులు వినిపిస్తున్నాయి. యూపీఏ హయాంలో బొగ్గు శాఖ సహాయ మంత్రిగా ఉన్న దాసరి నారాయణ రావు, బొగ్గు గనుల కేటాయింపులకు సంబంధించి జార్ఖండ్ లోని కొన్ని గనులు జిందాల్ సంస్థకు దక్కేలా వ్యవహరించారు. దీంతో ఆయనకు చెందిన కంపెనీ సౌభాగ్య మీడియాలో జిందాల్ పెట్టుబడులు పెట్టింది. ఈ మేరకు ఈ పెట్టుబడులు ముడుపులేనని సీబీఐ నిర్ధారించింది. ఇదే విషయాన్ని చార్జిషీట్ లోనూ పేర్కొంది. సీబీఐ చార్జిషీట్ ను ఆధారం చేసుకుని రంగంలోకి దిగిన ఈడీ, దాసరి ఆస్తులను జప్తు చేసే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి.