: సొంత పార్టీకి వ్యతిరేకంగా మేనకాగాంధీ గళం... ఇరుకునపడ్డ బీజేపీ!


గడచిన వారం రోజుల వ్యవధిలో కేంద్ర మంత్రి మేనకాగాంధీ రెండోసారి సొంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం వినిపించారు. వరకట్న నిరోధక చట్టానికి సవరణలు చేయాలని మోడీ సర్కారు యోచిస్తుండగా, మేనకా గాంధీ దాన్ని తప్పుబట్టారు. ఈ చట్టాన్ని మార్చరాదని ఆమె సూచించారు. గత కొంత కాలంగా వరకట్న వేధింపుల కేసుల్లో తప్పుడు ఫిర్యాదుల సంఖ్య అధికం కావడంతో, చట్ట సవరణ చేయాలని కేంద్రం భావించింది. "చట్టాన్ని మార్చాలని నేను భావించడం లేదు. మహిళల రక్షణ కోసం ఉన్న ఒకే ఒక్క చట్టం ఇది. ఈ చట్టం ఉన్నది ఉన్నట్టుగానే అమలు కావాల్సి ఉంది" అని మహిళ, శిశు సంక్షేమ శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్న మేనక అభిప్రాయపడ్డారు. కాగా, వరకట్న నిరోధక చట్టం కింద కేసు పెడితే, తక్షణం భర్తను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేయాల్సి ఉంటుంది. దీన్ని అలుసుగా తీసుకొని, కొన్ని తప్పుడు కేసులు దాఖలు కాగా, వీటిని అరికట్టేందుకు తొలుత పోలీసుల విచారణ జరపాలని, నిందితులకు స్టేషన్ బెయిలు లభించే అవకాశం ఇవ్వాలని కేంద్రం భావిస్తూ, చట్ట సవరణకు ముందడుగులు వేస్తోంది. కాగా, మేనక వ్యతిరేక వాదన బీజేపీని కొంత ఇరుకున పెట్టినట్టు సమాచారం.

  • Loading...

More Telugu News