: వరల్డ్ కప్ గెలిస్తే ధోనికి చీరలిస్తారట!


డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో వరల్డ్ కప్ బరిలో దిగిన టీమిండియా జైత్ర యాత్ర కొనసాగిస్తోంది. ఇప్పటిదాకా లీగ్ దశలో ఆడిన ఆరు మ్యాచ్ లతో పాటు బంగ్లాదేశ్ తో జరిగిన క్వార్టర్ ఫైనల్ లోనూ విజయ దరహాసం చేసిన ధోనీ సేన, ఈ నెల 26న ఆస్ట్రేలియాతో సెమీ ఫైనల్ ఆడబోతోంది. ఇందుకోసం ఇప్పటికే సిడ్నీ చేరిన టీమిండియా జట్టు ముమ్మర కసరత్తు చేస్తోంది. సెమీస్ లో నెగ్గి, ఫైనల్ లోనూ సత్తా చాటితే టైటిల్ చేజిక్కినట్లే. ఆ టైటిల్ తో భారత్ కు వచ్చే టీమిండియాకు ఘన స్వాగతం లభించడం ఖాయం. అయితే టీమిండియా సారథి మహేంద్ర సింగ్ ధోనీకి మాత్రం అరుదైన బహుమతి దక్కనుంది. వరల్డ్ కప్ తో ధోని వస్తే, చీరలిస్తామంటూ ఇండోర్ కు చెందిన ఓ సంస్థ ప్రకటించింది. అయితే ఇందుకోసం తయారైన చీరలు ఒక్కోటి రూ.65 వేల విలువ చేస్తాయట. వరల్డ్ కప్ టైటిల్, బీసీసీఐ లోగోలు ముద్రించిన ఈ చీరలను నిన్న ఇండోర్ లో సదరు సంస్థ ప్రదర్శనకు పెట్టింది.

  • Loading...

More Telugu News