: జగన్ మరో పోరు బాట... 26 నుంచి బస్సుయాత్ర
ఈ నెల 26 నుంచి వైకాపా అధినేత జగన్ బస్సు యాత్రను చేపట్టబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని ప్రాజెక్టుల స్థితిగతులను తెలుసుకునేందుకు ఆయన ఈ యాత్రను ఎంచుకున్నారు. పోలవరం, పట్టిసీమ, ప్రకాశం బ్యారేజీ, పోతిరెడ్డిపాడులతో పాటు రాయలసీమలో ఉన్న ప్రాజెక్టులను ఈ యాత్ర సందర్భంగా ఆయన పరిశీలిస్తారు. ఈ రోజు వైఎస్ఆర్సీఎల్పీ సమావేశం జరిగిన అనంతరం, ఆ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ జ్యోతుల నెహ్రూ ఈ వివరాలు వెల్లడించారు. ప్రజాపోరాటాల ద్వారానే ప్రభుత్వ అన్యాయాలను ఎదుర్కోవాలని తమ అధినేత నిర్ణయించినట్టు చెప్పారు. ఇదే సమయంలో స్పీకర్ కోడెలపై జ్యోతుల నెహ్రూ మండిపడ్డారు. స్పీకర్ వ్యవహార శైలి రాజ్యాంగ విరుద్ధంగా ఉందని ఆరోపించారు. టీడీపీ అరాచకాలపై రేపు మాక్ అసెంబ్లీ నిర్వహించనున్నామని వెల్లడించారు.