: చీటింగ్ చేసిన నటి శిల్పాశెట్టి... ఎంకే మీడియా ఫిర్యాదు... కేసు నమోదు


తమ నుంచి రూ. 9 కోట్లు తీసుకుని తిరిగి చెల్లించకుండా బాలీవుడ్ నటి శిల్పాశెట్టి చీటింగ్ చేసిందని ఎంకే మీడియా సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదును స్వీకరించిన కోల్ కతా పోలీసులు శిల్పాశెట్టితో పాటు రిపు సూదన్ కుంద్రా, ఈఎస్‌పీఎల్ సంస్థపై ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసు పెట్టినట్టు తెలిపారు. తమ సంస్థలో పెట్టుబడి పెడితే రెండేళ్లలో పది రెట్లు ఎక్కువ డబ్బు ఇస్తామని హామీ ఇవ్వగా, శిల్పాశెట్టి నిర్వహిస్తున్న సంస్థ ఈఎస్‌పీఎల్ లో రూ.9 కోట్లు పెట్టుబడి పెట్టామని, అందుకు ప్రతిగా, కంపెనీలో రూ. 30 లక్షల విలువైన ఈక్విటీ వాటాలు ఇచ్చారని ఎంకే మీడియా తెలిపింది. ఆ తరువాత ఈ షేర్లు బోగస్‌ వని గుర్తించి తాము మోసపోయామని గ్రహించినట్టు తెలిపింది. కాగా, తమ డబ్బును తిరిగి ఇప్పించాలంటూ ఎంకే మీడియా ఇప్పటికే కలకత్తా హైకోర్టులో సివిల్ కేసు వేసింది. ఈ కేసుపై విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News