: మార్కెట్లోకి మామిడి పండ్లు వచ్చేశాయ్!


ఈ సీజన్లో తొలివిడత మామిడి పండ్లు మార్కెట్లోకి వచ్చేశాయి. హైదరాబాద్ లోని గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్ యార్డులోకి మామిడి సరుకును మహబూబ్‌ నగర్, కర్నూలు, నల్గొండ జిల్లాలకు చెందిన రైతులు తరలించారు. తొలివిడత సరుకును లారీలు, డీసీఎంలలో కాకుండా ట్రాలీలు, మామిడి బుట్టలు, ట్రేలలో ప్యాకింగ్ చేసి తీసుకు వచ్చారు. వీటికి డిమాండ్ కూడా బాగానే ఉంది. కాగా, ఇక్కడికి వచ్చిన సరుకును స్థానికంగా అమ్మకానికి కాకుండా ఉత్తర భారతదేశంలోని వివిధ రాష్ట్రాలకు ఎగుమతి చేసేందుకు వ్యాపారులు ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా మహబూబ్‌ నగర్ కొల్హాపూర్ బంగినపల్లికి, కృష్ణాజిల్లా నూజివీడు బంగినపల్లి మామిడికి ఉత్తరాదిన మంచి డిమాండ్ ఉందని వ్యాపారులు తెలిపారు. బంగినపల్లితో పాటు తోతాపురి రకం కూడా మార్కెట్లోకి వచ్చింది. ఈ విషయం తెలిసిన ప్రజలు పెద్దఎత్తున గడ్డిఅన్నారం వచ్చి పండ్లను కొనుగోలు చేశారు. దీంతో మార్కెట్ పరిసరాల్లో సందడి నెలకొంది. మరో రెండు వారాల్లో మిగిలిన అన్ని ప్రధాన మార్కెట్లలోకి మామిడి దిగుబడి వస్తుందని సమాచారం.

  • Loading...

More Telugu News